ఉద్యోగులకు చీరలు పంపిణీ చేసిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) తన సొంత నిధులతో కలెక్టరేట్‌లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను ఆత్మీయ కుటుంబ సభ్యులుగా భావిస్తూ పండుగ కానుకలు అందజేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగులకు (Class IV Employees) చీరల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగులతో ఆత్మీయంగా మమేకమై బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో పండుగలను జరుపుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకాంక్షించారు. ఉద్యోగుల పట్ల తనకున్న ఆప్యాయతను చాటుతూ, పండుగ వేళ తన సొంత నిధులతో కానుకలు అందజేయడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. నిర్మల, పరిపాలన అధికారి సువర్ణ రాజు, నాలుగో తరగతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : భక్తుల కొంగుబంగారం.. అడెల్లి పోచమ్మ తల్లి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>