కలం, వెబ్డెస్క్: కిట్ క్యాట్ (KitKat) చాక్లెట్లో పురుగులు రావడంతో ఓ కస్టమర్ కంపెనీకి కంప్లైంట్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న లులూ మాల్ (Lulu Mall)లో చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి పండుగ సందర్భంగా లులూ మాల్లో షాపింగ్ చేశాడు. దుస్తులు, ఇంట్లోకి వస్తువులతో పాటు, కొన్ని చాక్లెట్లు కూడా కొన్నాడు. ఇంటికి వెళ్లాక ఓ కిట్ క్యాట్ చాక్లెట్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్న పురుగులను చూసి షాకయ్యాడు. ఈ ఘటనతో సదరు వ్యక్తి కుటుంబసభ్యులు కూడా దిగ్బ్రాంతికి గురయ్యారు. చిన్న పిల్లలు చూడకుండా తింటే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.
సదరు కస్టమర్ ఈ ఘటనపై ఆహార భద్రతా అధికారులకు, సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేశారు. పురుగులు ఉన్న చాక్లెట్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో లులూ మాల్(Lulu Mall)లో ఉన్న వస్తువుల నాణ్యతపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుంటాయి. ఇందులో నాన్వెజ్ కూడా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ముగియకున్నా చాక్లెట్లో పురుగులు ఉండటంతో మిగతా ఆహార పదార్థాల పరిస్థితి ఏంటంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై లులూ మాల్ యాజమాన్యం, కిట్క్యాట్ కంపెనీ (KitKat Company) స్పందించాల్సి ఉంది. మరోవైపు పండుగ సమయంలో స్వీట్లు, ఇతర తినుబండారాలు కొనుగోలు చేస్తున్నప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసి తీసుకోవాలని, ప్యాకేజ్డ్ ఐటెమ్స్ కొనుగోలు చేస్తే తప్పకుండా తినేముందు పరిశీలించాలని నిపుణులు కోరుతున్నారు.
Also Read : పారా గేమ్స్ సెలక్షన్స్పై వివాదం.. కోర్టుకెక్కిన చిరాగ్ బారేథా!
Follow Us On: X(Twitter)

