కలం, వెబ్ డెస్క్: ప్రకృతి విపత్తు అనేది ప్రభుత్వం చేతుల్లో ఉండదని.. దీనిని ప్రజలు అర్ధం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదనే ఎల్నినోపై రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారని తెలిపారు. ప్రతిపక్షాలు అన్నట్లుగా ఎల్నినో అనేది తెలంగాణ సమస్య కాదని.. ప్రపంచ సమస్య అని పేర్కొన్నారు. ఎల్నినోతో మొదట నష్టపోయేది రైతులేనని.. అందుకే రైతులు ప్రతిపక్షాల మాటలు వినవద్దని కోరారు.
నీళ్లు ఎక్కువగా అవసరం అయ్యే పంటలను రైతులు వేయవద్దని చెప్పారు. వరి లాంటి పంటలు వేయడం వలన నీటి లభ్యత దొరకక పోతే తాగునీరుకు, ఆర్ధికంగా ఇబ్బందులు పడతామని అన్నారు. నీటి కొరతతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలతో రాష్ట్ర రైతాంగం నీటి ఆధారిత పంటలకు దూరంగా ఉండాలని విన్నవించారు.

