మహబూబ్‌నగర్, దేవరకద్ర బార్లకు యజమానుల ఎంపిక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయగా, దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 12వ తేదీతో ముగిసింది. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున నాన్‌-రిఫండబుల్ ఫీజును దరఖాస్తుదారులు చెల్లించారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాకు రెండు కొత్త బార్లు (Two New Bars) కేటాయించారు. ఈ రెండు బార్ల ఏర్పాటుకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా లక్కీ డ్రా నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఈమేరకు మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బార్‌కు సంబంధించి మొత్తం 78 దరఖాస్తులు, దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని బార్‌కు 90 దరఖాస్తులు అందాయి.

లక్కీ డ్రా ద్వారా మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలో బార్ ఏర్పాటుకు టోకెన్ నంబర్ 34 కలిగిన కొంగు రాజయ్య ఎంపికయ్యారు. దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బార్ ఏర్పాటుకు టోకెన్ నంబర్ 53 కలిగిన జంగ నగేష్ ఎంపికయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక లైసెన్స్ ఫీజు ప్రకారం మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బార్‌కు రూ.40 లక్షలు, దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని బార్‌కు రూ.32 లక్షలుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్. బి హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>