ఆలూర్‌ – ధని రహదారి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపన

కలం, సారంగాపూర్ : సారంగాపూర్ మండలం ఆలూర్‌ నుంచి ధని గ్రామం వరకు రూ.3.60 కోట్ల సీఆర్‌ఆర్‌ నిధులతో చేపట్టనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (Alleti Maheshwar Reddy) శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆలూర్‌, ధని గ్రామాలతో పాటు ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులు కీలకమని ఎమ్మెల్యే (Maheshwar Reddy) అన్నారు.  ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో ఆలూర్​ – ధని రహదారి ఉపయోగపడనుందని మహేశ్వర్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూర్‌, ధని గ్రామల సర్పంచ్‌ లు ఇర్ల చిన్నయ్య, బడి పోతన్న, బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ నరేష్, నాయకులు ఇర్ల విజయ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>