కలం, వెబ్ డెస్క్ : విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ (Sai Krishna) కస్టోడియల్ డెత్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ దారుణ సంఘటనపై పూర్తిస్థాయి నిజాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించడమే సరైన మార్గమని భావిస్తూ, కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో పోలీసుల విచారణ తీరుపై, మృతదేహం మాయం కావటంపై మొదటి నుంచీ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పారదర్శకమైన విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు, ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

