రేపటిలోగా బోరిగాం రైతులకు సాగునీరు విడుదల చేయాలి: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్ : సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామ రైతుల (Borigam Farmers) వరి పంటలకు శనివారం‌లోగా సాగునీరు విడుదల చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఇరిగేషన్ ఈఈ అనిల్‌ను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో బోరిగాం గ్రామ రైతులు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. గ్రామ చెరువు కింద సుమారు 700 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులో నీరు లేక సాగునీటి కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకోవడంతో నీరు అత్యవసరంగా అవసరమని పేర్కొన్నారు. పంటలు ఎండిపోకుండా స్వర్ణ జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. రైతుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే రేపటి లోగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారిని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>