పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వరుసగా ఆరు కార్లు ఢీ!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే (PVNR Expressway Acciden)పై ఒక్కసారిగా కలకలం రేగింది. వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లి అక్కడ ఉన్న విద్యుత్ పోల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని పరిణామంతో వెనకాలే వేగంతో వస్తున్న ఐదు కార్లు సమయానికి బ్రేక్ వేయలేక ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ చైన్ కొలిజన్ ప్రమాదంలో ఆరు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదం ధాటికి ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>