లంచం తీసుకుంటూ దొరికిపోయిన తహసీల్దార్, ఆపరేటర్

కలం, రాజన్న సిరిసిల్ల: ​వేములవాడ (Vemulawada)లో అవినీతి నిరోధక శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. లంచం తీసుకుంటుండగా వేములవాడ రూరల్ తహసీల్దార్‌తో పాటు ఒక ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ​వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన ఒక రైతుకు సంబంధించిన భూమిని గిఫ్ట్ డీడ్ (బహుమతి రిజిస్ట్రేషన్) చేయడానికి అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడు తన అత్తకు సంబంధించిన భూమిని తన తండ్రి పేరిట గిఫ్ట్ డీడ్ చేయించుకోవడానికి అధికారులను సంప్రదించగా, వారు రూ. 8,000 లంచం డిమాండ్ చేశారు.

​అధికారులు లంచం అడగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పథకం ప్రకారం వ్యూహరచన చేసిన ఏసీబీ అధికారులు గురువారం దాడి చేసి లంచం తీసుకుంటుండగా అధికారులను పట్టుకున్నారు. ఈ దాడిలో వేములవాడ రూరల్ తహసీల్దార్ ​మహమ్మద్ అబూబాకర్, భూ భారతి ఆపరేటర్ ​శంకసాల అనిల్ కుమార్ లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ​వారికి కెమికల్ టెస్ట్ పూర్తి చేసిన అనంతరం, వారి వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు సేకరించారు. అనంతరం నిందితులను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>