మూలా నక్షత్రం వేడుకలకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ

కలం, బాసర : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం (Basara Temple)లో శుక్రవారం నిర్వహించనున్న మూల నక్షత్రం మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఆలయ (Basara Temple) పరిసరాల్లో రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, గోదావరి స్నాన ఘట్టాల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నదిలో నీటి ప్రవాహ ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>