పోలీస్ సిబ్బంది కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.. ఖమ్మం సీపీ

కలం, ఖమ్మం బ్యూరో: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండే పోలీస్ సిబ్బంది కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ (Khammam CP) సునీల్ దత్ సూచించారు. ​పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సీపీ గురువారం ప్రారంభించారు. ​ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కంటి చూపు సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించాలన్నారు. అవసరమైన వైద్య చికిత్స పొందడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.

ఈ వైద్య శిబిరంలో పోలీస్ సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారన్నారు. కంటి చూపు సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు తదుపరి చికిత్స పొందాలని సూచించారు. ​పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం శాఖ తరఫున అవసరమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, ఏఆర్ ఏసీపీ నర్సయ్య పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>