రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: బిగాల గణేష్ గుప్తా

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ (Ganesh Bigala) వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సమయానికి పంట పెట్టుబడి అందక, యూరియా లభించక, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతూ, సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జలవిద్యుత్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించకుండా, ఎల్‌నినో ప్రభావాన్ని కారణంగా చూపిస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని అభిప్రాయపడ్డారు.

సమస్యలకు అధికారులే కారణమన్నట్లుగా వారిని తప్పుబట్టడం, సస్పెన్షన్ల పేరుతో బెదిరించడం కంటే, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని గ‌ణేష్ గుప్తా సూచించారు. మూసీ ప్రాజెక్టులు, సౌత్ సిటీ వంటి ఇతర అంశాలపై దృష్టి సారిస్తూనే, రైతుల ప్రస్తుత సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే కింది చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు.

గ‌ణేష్ గుప్తా డిమాండ్‌లు ఇవే..

సాగునీటి విడుదల:

పంటలు ఎండిపోకుండా అవసరమైన ప్రాంతాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి.

నిరంతర విద్యుత్ సరఫరా:

వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలి.

పంట పెట్టుబడి సాయం:

రైతులకు సమయానికి పెట్టుబడి సాయం అందించాలి.

యూరియా సరఫరా:

రైతులకు అవసరమైన ఎరువులను ఎలాంటి కొరత లేకుండా సమయానికి అందుబాటులో ఉంచాలి. నీరు, విద్యుత్ కొరత కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలి.

మోటార్లు, బోర్ల మరమ్మతులు:

విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లు కాలిపోతే, బోర్లు దెబ్బతింటే రైతులకు ఆర్థిక సహాయం అందించి మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

గృహ విద్యుత్ సరఫరా:

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాస గృహాలకు కూడా అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి అంటూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>