విజ‌య్‌, ర‌ష్మిక‌ల‌పై నాని పొగ‌డ్త‌ల వ‌ర్షం!

క‌లం, సినిమా: రౌడీ బోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) జంటగా న‌టించిన లేటెస్ట్ మూవీ ర‌ణ‌బాలి (Ranabaali). మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ అంచ‌నాల న‌డుమ రూపొందిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక సాధారణ అబ్బాయిగా ఉండే విజయ్ ఈ సినిమా కోసం త‌న‌ను తాను ఎంతో మార్చుకున్నాడ‌న్నారు. ‘రణబాలి’ పాత్రలో ఎంతో సులభంగా ఒదిగిపోయిన తీరు చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. అలాగే ‘జయమ్మ’ పాత్రలో రష్మిక ఎంతో నేచుర‌ల్‌గా కనిపిస్తున్నారని ఆయన కొనియాడారు.

ఇలాంటి కథలను డీల్ చేయడంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చాలా ఫేమ‌స్ అని, ఈ సినిమా (Ranabaali) కోసం ఆయన తన హార్ట్ పెట్టి పని చేశారని నాని ప్ర‌శంసించారు. ఈ సినిమా కోసం టీమ్‌ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఘన విజయం సాధించాలని ఆకాంక్షస్తూ, మూవీ యూనిట్ మొత్తానికి నాని బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Also Read : ఎవరీ గరివిడి లక్ష్మి..? ఆమె పాటలకు ఎందుకంత క్రేజ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>