అమిత్ షా రాజీనామా చేయాలి.. మంత్రి పొన్నం డిమాండ్

కలం, వెబ్ డెస్క్: సర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డాని, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఇండి కూటమి ఇటీవల ఢిల్లీలో తీవ్ర నిరసన (INDIA Alliance Protest) చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మార్చ్‌కు సైతం రాహుల్ గాంధీ సహా ఇండి కూటమి నేతలు, కార్యకర్తలు కదం తొక్కారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తమపై పోలీసులతో అడ్డుకుంటుందని, తమ నేతలను అరెస్ట్ చేశారని తీవ్ర స్థాయిలో ఇండి కూటమి నేతలు మండిపడ్డారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో తీవ్ర నిరసనలు హోరెత్తాయి.

ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. ఈ మొత్తానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు. సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తూ హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సుప్రీంకోర్టులో బేషరతు క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం  ఏకంగా సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. సర్వోన్నత న్యాయస్థానం అంటే కేంద్రానికి కనీస గౌరవం లేదని.. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా ధిక్కరిస్తోందని దుయ్యబట్టారు. దీన్ని దేశ ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

Also Read : విజ‌య్‌, ర‌ష్మిక‌ల‌పై నాని పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>