కలాం ఆశయాలు నెరవేర్చడమే నేటితరం బాధ్యత: వెంకటేశ్వర్లు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: డ్రీం ఫోర్స్ ఫౌండేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి (APJ Abdul Kalam Jayanti) వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని కలాం సైన్స్ ల్యాబ్ ఆవరణలో కలాం విగ్రహానికి డ్రీం ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు టీఎన్ వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు కలాం అని, ఆయన ఆశయాలు నెరవేర్చడమే నేటితరం బాధ్యత అని అన్నారు. దసరా సెలవుల సందర్భంగా ఐదు రోజులుగా పదో తరగతి విద్యార్థులకు వందకు వంద మార్కుల సాధన పై జరుగుతున్న ఉచిత శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఎంతో ఆత్మవిశ్వాసం పెంపొందిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలాం సైన్స్ ల్యాబ్ ప్రతినిధులు నర్సప్ప, కరుణాకర్ గౌడ్, మల్లప్ప, గుముడాల చక్రవర్తి గౌడ్, వ్యక్తిత్వ వికాస నిపుణులు సి. మల్లయ్య, సత్యం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన 65 మంది విద్యార్థులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>