హెడ్ పోస్టాపీసు ఎదుట గ్రామీణ తపాల ఉద్యోగుల నిరసన

కలం, కరీంనగర్: తమ సమస్యల సాధన కోసం ఆల్ ఇండియా గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం (ఎఐజీడీఎస్‌యూ) పిలుపు మేరకు గురువారం కరీంనగర్ హెడ్ పోస్టాపీసు ఎదుట గ్రామీణ తపాల ఉద్యోగులు (Postal Employees) నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఏఐజీడీఎస్‌యూ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. 8వ వేతనానికి సంబంధించి కేంద్రం ప్రకటించినా, ఇప్పటివరకు గ్రామీణ తపాల ఉద్యోగుల కోసం కమిటిని ఏర్పాటు చేయలేదని.. వెంటనే కమిటి ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న బీట్ మేకానిజాన్ని కూడా పునరాలోచించాలని సుధాకర్ డిమాండ్ చేశారు. అలాగే అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో దశల వారీగా తమ పోరు కొనసాగుతుందని సుధాకర్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు లచ్చన్న, సుగుణాకర్ లతో పాటు గ్రామీణ తపాల ఉద్యోగులు రాజేందర్, అప్సర్, జగన్ రెడ్డి, శేఖర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>