కలం, ఉట్నూర్ : ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) అన్నారు. గురువారం ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ డివిజన్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందేలా ఎమ్మెల్యే (Bojju Patel) చూడాలన్నారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కొత్త కనెక్షన్లు, మీటర్ల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాల సమస్యలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశించారు.

