కలం, వెబ్ డెస్క్ : ఎల్నినో ఎఫెక్ట్తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) వెల్లడించారు. సింగూర్ ప్రాజెక్టు (Singur Project) వద్ద ఆయన పరిస్థితిని సమీక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఫిబ్రవరి నెల వరకు ఎల్నినో ప్రభావం అత్యున్నత స్థాయిలో ఉంటుందని, దీంతో నీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు.
రాష్ట్రంలో నీటి వినియోగంపై స్పష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాగునీటి అవసరాల కంటే తాగునీటి సరఫరాకే తమ మొదటి ప్రాధాన్యం ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. అదే సమయంలో, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే 15 నుంచి 20 రోజుల పాటు పంటలను కాపాడుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు.
పరిస్థితి తీవ్రతను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకూ ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించి, క్షేత్రస్థాయిలో నిరంతర సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారని, క్యాబినెట్లోనూ విస్తృతంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, సింగూర్ ప్రాజెక్ట్ రివ్యూ పనులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సీఎస్ సంజయ్ జాజు (CS Sanjay Jaju) సమాధానం దాటవేడం గమనార్హం.
Also Read : ఐఏఎస్లకు యాదాద్రి ప్లాంట్ పర్యవేక్షణ బాధ్యత
Follow Us On: X(Twitter)

