మత మార్పిడి రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

కలం, వెబ్ డెస్క్: మత మార్పిడి రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ముస్లిం మతంలోకి మారిన బీసీలు రిజర్వేషన్ అర్హత కోల్పోతారని స్పష్టం చేసింది. హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్లిన వారు ఎలాంటి లబ్ధి పొందలేరని పేర్కొంది. పాత కులం, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా కొత్త మతంలో అలాంటి రిజర్వేషన్లు పొందలేరని వివరించింది. ఈ మేరకు మద్రాస్ హై కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ పీకే మిశ్రా, శ్రీ చంద్రశేఖర్ ధర్మాసనం సమర్థిస్తూ తుది తీర్పు ప్రకటించింది.

తమిళనాడులో ముస్లింలకు ప్రత్యేకంగా 3.5 శాతం ఉప కోటా అమలవుతోంది. అయితే ముస్లిం మతంలోకి మారిన బీసీ, ఎంబీసీ, డీఎన్‌సీ వర్గాలకు కూడా 2024, మార్చి నుంచి రిజర్వేషన్లు అమలు చేస్తూ వస్తోంది. దీన్ని మద్రాస్ హై కోర్టులో సవాల్ చేయగా.. సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను కొట్టేస్తూ జూన్ నెలలో తీర్పు ఇచ్చింది. దీన్ని సుప్రీం కోర్టు(Supreme Court)లో సవాల్ చేయగా మద్రాస్ కోర్టు తీర్పునే సమర్థించింది.

Also Read : నాలుగేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. వధువు షాకింగ్ నిర్ణయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>