సీజేపీ నేతల అరెస్ట్.. జగన్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు మద్దతు ప్రకటించారు. సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలపై పోలీసుల చర్యలను ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి నెలకొల్పాలి. సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను అరెస్ట్ చేయడం వలన సమస్య పరిష్కారం కాకపోగా.. పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. సమస్య వచ్చిన తరువాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవడం ఎల్లప్పుడూ మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పేర్కొన్నారు. తమ నేతలకు మద్దతు తెలిపినందుకు జగన్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు చెప్పారు.

Also Read : ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>