ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు!

కలం, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటుడు, అమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ముంబైలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.

అనుమతి లేకుండా గుమిగూడి ఆందోళన చేపట్టారనే ఆరోపణలతో వందలాది మంది ఆందోళనకారులతో పాటు ఆయనను కూడా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అమెరికన్ పౌరసత్వం కలిగిన విదేశీయుడు కావడంతో, విదేశీ నిబంధనల ఉల్లంఘన కింద ఆయన వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచిస్తూ పోలీసులు అధికారికంగా నోటీసులు ఇచ్చారు.

Also Read : సర్ ప్రక్రియపై సుప్రీం కోర్టులో నేడు విచారణ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>