బెంగళూరు పబ్‌ వివాదం.. ఐఏఎస్ అధికారి బదిలీ!

కలం, వెబ్ డెస్క్ : బెంగళూరులోని ఒక పబ్‌లో మద్యం మత్తులో పోలీసులపై దుర్భాషలాడి, వారిపై దాడికి ప్రయత్నించిన సంఘటనలో వివాదాస్పద ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ (IAS Vikas Marmat)పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆయనను కడ ప్రాజెక్టు డైరెక్టర్ (KADA Project Director) బాధ్యతల నుంచి తక్షణమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వికాస్ మర్మత్ (IAS Vikas Marmat) పై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ (CS Sai Prasad) ఈ బదిలీ ఆదేశాలను ఇచ్చారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ పరిణామాల క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు కడ ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read : ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>