బంగాళాఖాతంలో అల్పపీడనం: పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్!

కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ((Heavy Rains Alert)) ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఈ నెల 19వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అదేవిధంగా ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో వర్షాలు మరిన్ని రోజులు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణలోనూ నేటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>