నేడు సీఎం రేవంత్ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మంత్రులతో సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, కరువు పరిస్థితులపై ఉన్నత స్థాయిలో సమీక్ష చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 250 పై చిలుకు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం సీజన్ కూడా ముగిసిపోయింది. అన్ని రిజర్వాయర్లలో నీళ్లు అరకొర మాత్రమే ఉండటంతో తాగు నీటిని అందించడమే సవాల్‌గా మారబోతుంది.

ఎండలు దంచికొడుతుండటంతో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతోంది. వచ్చే వేసవి కాలం వరకు కష్టాలు తప్పేలా లేవని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించుకునేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించడం, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులతో సమాలోచనలు చేయనున్నారు. సమావేశం అనంతరం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>