గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్​.. గొంగిడి సునీత సూచనలు

కలం, యాదగిరిగుట్ట : కాంగ్రెస్ హామీలతో ప్రజలు మోసపోయారని, రాబోయే ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకురాలు గొంగిడి సునీత (Gongidi Sunitha) పిలుపునిచ్చారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఆమె ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఓటరు నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ.. రైతుబంధు, రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆమె (Gongidi Sunitha) విమర్శించారు.

హామీలు అమలుకాక ప్రజలు నిరాశకు గురవుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు కేటీఆర్‌లా బాధ్యత తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలని, ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని సునీత ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>