కలం, ముధోల్ : ముధోల్ నియోజకవర్గంలోని తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం మంజూరు చేయడంతో పాటు, గెస్ట్ ఫ్యాకల్టీని త్వరితగతిన నియమించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) కోరారు. బుధవారం హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డైరెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కళాశాలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం మంజూరు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన గెస్ట్ ఫ్యాకల్టీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. దీనిపై డైరెక్టర్ సానుకూలంగా స్పందించి, త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

