విద్యుత్ కోత‌ల‌పై సీఎం రేవంత్‌ ఫైర్!

క‌లం, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో కొన‌సాగుతున్న విద్యుత్ కోత‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్ని సార్లు స‌మీక్ష‌లు జ‌రిపి ఆదేశాలు జారీ చేస్తున్నా ఎందుకు ప‌రిస్థితిలో మార్పు రావ‌డం లేద‌ని అధికారుల‌పై మండిప‌డ్డారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొర‌త ముప్పు ఉంద‌ని తెలిసినా ఉత్ప‌త్తి ఎందుకు పెంచ‌డం లేద‌ని నిల‌దీశారు. బొగ్గు లింకేజీలు ఉన్నా యాదాద్రి ప్లాంట్‌లో ఉత్ప‌త్తి ఎందుకు జ‌ర‌గ‌డం లేద‌న్నారు.

విద్యుత్ స‌ర‌ఫ‌రాలో మార్పులు తీసుకొచ్చేలా ప‌ని చేయాల‌ని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాపై నిర్ల‌క్ష్యం చేస్తే ఏ ఒక్క‌రినీ ఉపేక్షించేది లేద‌న్నారు. లేదంటే స్పెష‌ల్ సీఎస్, జెన్‌కో సీఎండీల‌ను స‌స్పెండ్ చేస్తాన‌ని సీఎం రేవంత్ హెచ్చ‌రించారు. తాగునీటి స‌ర‌ఫ‌రాకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పంట‌ల‌ను కాపాడేందుకు నిరంత‌రం విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>