నిర్మల్​ క్రిటికల్ కేర్ బ్లాక్‌ను వెంటనే ప్రారంభించాలి: ఆప్

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి బ్లాక్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 25 శాతం పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వెంటిలేటర్లు వంటి కీలక వైద్య పరికరాలు రావాల్సి ఉందని తెలిపారు.

నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. మిగిలిన పనులు పూర్తి చేసి, అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చి వైద్య సేవలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజారోగ్యాన్ని రాజకీయాలకు బలి చేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు సీహెచ్‌ వినోద్, సాధిక్, బైండ్ల శ్రీనివాస్, మెరుగు రాజన్న, చుక్కల భూమన్న, శీతల్కార్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>