కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో యూకే మేయర్ల బృందం సమావేశమైంది. ఈ మీటింగ్కు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. రాష్ట్రంలో యూకే పెట్టుబడులకు అవకాశాలు, యూకే-తెలంగాణ వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం దిశగా కార్యాచరణపై చర్చించారు. వైద్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్టైల్స్, నైపుణ్యాలు, పరిశోధన, తయారీ రంగాలలో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ మీటింగ్కు యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధులు, సీఎస్ సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

