ఎయిడ్స్ నివారణ చర్యలపై అధికారుల కీలక సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ (AIDS Prevention), నియంత్రణ కార్యకలాపాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం కీలక సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఆర్‌టీ, ఐసీటీసీ, డీఎస్‌ఆర్‌సీ కేంద్రాలు, టీఐ ఎన్జీవోలు, విహాన్, వైఆర్జీ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రాల పనితీరును సమీక్షించిన అధికారులు.. సేవల విధానాన్ని మెరుగుపరుస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ సేవలను విస్తృతం చేయడం, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను వెంటనే ఏఆర్‌టీ చికిత్సకు అనుసంధానించడం, లబ్ధిదారులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సిబ్బంది అందరూ పరస్పర సమన్వయంతో, రికార్డుల ఖచ్చితత్వాన్ని పాటిస్తూ పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>