నిర్మల్ నర్సింగ్ కాలేజీలో కలెక్టర్ తనిఖీ

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల (Nirmal Nursing College) ను బుధవారం కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాల పరిసరాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి, కళాశాల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కళాశాలకు సంబంధించి, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సంఖ్య అడిగి తెలుసుకున్నారు. ప్రణాళిక ప్రకారం విద్యా సంవత్సర సిలబస్ పూర్తి చేయాలన్నారు. నర్సింగ్ వృత్తి అంటే ప్రజలకు నిస్వార్థ సేవ అందించడమని, విద్యార్థుల్లో సేవా భావం పెంపొందించాలన్నారు.

చదువు పూర్తి కాగానే వారు నర్సింగ్ వృత్తిలో స్థిరపడేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రాక్టికల్ విద్యాబోధన మెరుగ్గా అందించేలా దృష్టి సారించాలని సూచించారు. కళాశాలలో పలు మాలిక వసతుల అవసరాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికితీసుకురాగా స్పందించిన కలెక్టర్ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీలో వైద్య కళాశాల (Nirmal Nursing College) ప్రిన్సిపాల్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>