ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ స్పెషల్ విందు.. వైరల్ అవుతున్న పోస్ట్!

కలం, సినిమా: పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. ఆయన తరచుగా తన కోస్టార్స్‌కి అదిరిపోయే రుచులతో ట్రీట్ ఇస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి అదిరిపోయే అతిథ్యం ఇచ్చారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఇమాన్వికి ప్రత్యేక విందు పంపించారు.

ఇటీవల ఇమాన్వి (Imanvi) పుట్టినరోజు సందర్భంగా వివిధ రకాల వంటకాలతో కూడిన భోజనాన్ని ప్రభాస్ (Prabhas) అందించినట్లు సమాచారం. ఈ విందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇమాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని ఆమె చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

సహనటులకు రుచికరమైన భోజనాన్ని అందించడం ప్రభాస్‌కు ఎప్పటి నుంచో అలవాటు. గతంలోనూ పలువురు హీరోయిన్లు, సినిమా బృంద సభ్యులకు ఆయన ప్రత్యేక విందులు ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచారు. సాహో, ఆదిపురుష్ వంటి సినిమాల సమయంలోనూ ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం గురించి చర్చ జరిగింది. ఇప్పుడు ఇమాన్వి కూడా ఈ జాబితాలో చేరడంతో ప్రభాస్ ఆతిథ్యంపై మరోసారి సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఫౌజీ సినిమాలో ప్రభాస్, ఇమాన్వి జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : రష్మిక గొప్ప మనసు.. 400 కుటుంబాలకు సాయం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>