నీటి సంరక్షణ పనులు విరివిగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: గ్రామీణ ప్రాంతాల్లో వీజీబీ రామ్‌ జీ పథకం అమలు, అర్హులకు ఉపాధి కల్పన, నీటి సంరక్షణ పనులు చేపట్టే అంశాలపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వీజీబీ రామ్‌ జీ జాబ్ కార్డులు కలిగిఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకుగానూ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, క్షేత్ర సహాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం చేత వ్యవసాయం, తదితర అంశాల్లో ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరికీ వీజీబీ రామ్‌ జీ కింద 125 రోజుల పని కల్పించాలన్నారు. ఉపాధి కల్పన ద్వారా పేదలకు ఆర్థికంగా తోడ్పాటు అందించినట్లవుతుందన్నారు. ఈ పథకం కింద 375 రకాల పనులు చేసుకోవచ్చని, జిల్లాలో అవకాశం ఉన్న పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పనికి వెళ్లేలా ప్రజల్ని ప్రోత్సహించాలని తెలిపారు. నీటి సంరక్షణ పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీని ద్వారా పేదలకు ఉపాధి కల్పించడమే కాకుండా, భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పడినవారమవుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేశ్, డీఆర్డిఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీనివాస్, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>