తెలంగాణలో పుట్టడమే అదృష్టంగా భావించేలా సంక్షేమ పథకాలు: భట్టి

కలం, నాగర్ కర్నూల్: తెలంగాణలో పుట్టడమే అదృష్టంగా భావించేలా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు.

నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూర్ (Mannanur) గ్రామంలో రూ.53.78 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/30 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని, ఈ లెక్కలపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని భట్టి సవాల్ విసిరారు.

1.06 కోట్ల కుటుంబాలకు వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితం, 1.15 కోట్ల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, 43 లక్షల మందికి చేయూత పింఛన్లు, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 76 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, కల్పించామని, అచ్చంపేటలోనే 7,300 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు.

అచ్చంపేట ప్రాంతంతో నాకు 1980 నుండి, అంటే 46 ఏళ్ల అనుబంధం ఉంది. మా అన్నయ్య మల్లు అనంతరాములు ఇక్కడి నుండి పార్లమెంటుకు పోటీ చేసినప్పటి నుండి ఈ గ్రామాలతో పరిచయం ఉందని భట్టి గుర్తు చేసుకున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటికే విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి రూ.75 కోట్లుఖర్చు చేశామని తెలిపారు.

రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి రూ. 90 వేల కోట్లు కేటాయించామని, అచ్చంపేటను ప్రధాన రవాణా కూడలిగా, మన్ననూర్, నల్లమల అడవుల్లో ఎకో టూరిజం ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ కృతజ్ఞతలు

ప్రజా ప్రభుత్వం వచ్చాక తన విజ్ఞప్తి మేరకు అచ్చంపేటలో 14 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లు, 220/33, 132/33 సామర్థ్యంతో మరో రెండు సబ్ స్టేషన్లు మంజూరు చేశారని, అచ్చంపేటలో ఎస్‌పీడీసీఎల్ డివిజన్ కార్యాలయానికి జీఓ ఇచ్చారని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ (MLA Vamshi Krishna) తెలిపారు. సహకరించిన డిప్యూటీ సీఎం భట్టి(Bhatti Vikramarka)కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : కేటీఆర్ హెయిర్ ప్లాంటేషన్‌పై బల్మూర్ వెంకట్ వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>