కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (Jagtial Additional Collector) (రెవెన్యూ) గా ఎన్. ప్రసూనాంబ (Prasunamba) బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమెను అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించారు. గతంలో ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయంలో డిప్యుటేషన్పై విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీ పై జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్గా నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసూనాంబ బాధ్యతలు చేపట్టడంతో జిల్లా రెవెన్యూ అధికారి కే.వై. ప్రసాద్, కలెక్టరేట్ ఏవో కిషన్, కలెక్టరేట్ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

