పెండింగ్‌ కేసులపై నిర్మల్ ఎస్పీ నేర సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

కలం, నిర్మల్‌: పెండింగ్‌ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా నాణ్యమైన దర్యాప్తుతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి నేర సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా పెండింగ్‌ కేసులు, ఈ – పెట్టీ కేసుల పరిష్కారం, దసరా బందోబస్తు, దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. దర్యాప్తులో ఉన్న కేసులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. దసరా పండుగ, దుర్గామాత ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

నిమజ్జన మార్గాలు, చెరువులు, వాగుల వద్ద ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, ఎస్‌బీ ఇన్స్పెక్టర్‌ మల్లేష్‌, డీసీఆర్‌బీ, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>