కలం, నిర్మల్: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడి రెండు గేదెలు విద్యుత్ షాక్తో (Electric Shock) మృతి చెందిన ఘటన నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ కాలనీ శివారులో బుధవారం చోటుచేసుకుంది. మంజులాపూర్కు చెందిన సుభాష్రెడ్డి, పోశెట్టికి చెందిన రెండు గేదెలు (Two Buffaloes ) ఎప్పటిలాగే మేత కోసం వెళ్లాయి.
కాలనీ శివారు ప్రాంతంలో మేత మేస్తుండగా విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడటంతో షాక్కు గురై రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల విలువైన పశువులను కోల్పోయినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకున్నారు.

