కలం, ఉట్నూర్: ట్రాన్స్జెండర్ల రాజకీయ సాధికారతకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో మద్దతుగా మాట్లాడిన ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA), నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను (Vedma Bhojju Patel) ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు ఆదివారం ఉట్నూర్‌లోని (Utnoor) ఆయన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. రాజకీయ ప్రాతినిధ్యం, సమాన అవకాశాల కోసం తమకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యేకు ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్నారు. ట్రాన్స్జెండర్ల హక్కులు, రాజకీయ సాధికారతకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

