తెలంగాణ విమోచన దినోత్సవంపై ఎమ్మెల్యే పవార్ కీలక డిమాండ్

కలం, బైంసా: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం బైంసా పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాది అనంతరం తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.

తెలంగాణ విముక్తి కోసం కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక వర్గం మెప్పు కోసం సెప్టెంబర్ 17 వేడుకలను అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన జాతీయ జెండాలను ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని పవార్ రామారావు పటేల్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>