మోదీ 25 ఏళ్ళ ప్రస్థానం.. ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి: గోపి

కలం, రాజన్న సిరిసిల్ల: గుజరాత్ సీఎంగా ప్రారంభమైన ప్రజాసేవా ప్రస్థానం నుంచి ప్రధానిగా 25 ఏళ్లుగా నిరంతర ప్రజాసేవ చేస్తున్న మోదీ సేవా ప్రస్థానం ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి (Reddaboina Gopi) అన్నారు. ప్రధాని ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో “సేవా సంకల్ప్ అభియాన్” జిల్లా కార్యశాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యశాలకు ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు రానున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో 9 ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటేనే కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రతి కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ కార్యక్రమాలను క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వహిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం దూరం కాదని రెడ్డబోయిన గోపి (Reddaboina Gopi) అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ జెండా ఎగరడం కోసం ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు బీజేపీలో రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజాక్షేత్రంలో నిరంతరం కష్టపడే కార్యకర్తలే భవిష్యత్తులో నాయకులుగా ఎదుగుతారని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఇచ్చిన నెల రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త సమయాన్ని కేటాయించి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ప్రజల కోసం పనిచేస్తూ, పార్టీని బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, లింగంపల్లి శంకర్, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ దశరథం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బర్కం లక్ష్మి, శీలం రాజు, మల్లారపు సంతోష్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు మిస సంజీవ్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, రాష్ట్ర-జిల్లా పదాధికారులు, వివిధ మండలాల అధ్యక్షులు, మండల పదాధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : అధికారం కాదు… భాగస్వామ్యం ముఖ్యం: ప్రధాని మోదీ పిలుపు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>