కలం, సారంగాపూర్ : రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని నిర్మల్ (Nirmal) రూరల్ సీఐ ఎం.కృష్ణ సూచించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
మహారాష్ట్రకు చెందిన డీజే సెట్అప్లకు ఎలాంటి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై వసంత్, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

