అశోక్‌నగర్‌లో నూతన బోరు ప్రారంభించిన మేయర్ శ్రీనివాస్

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పట్టణం అశోక్ నగర్ (Ashok Nagar) 54వ డివిజన్ పరిధిలో నూతనంగా కలిసిన కాలనీలో నీటి సమస్యతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీవాసుల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా ఏర్పాటు చేసిన నూతన బోరును శనివారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) ఘనంగా ప్రారంభించారు. డివిజన్ కార్పొరేటర్ గొట్టేముక్కుల ఉమారాణి వెంకటరమణ కాలనీలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని గుర్తించి ప్రత్యేకంగా బోర్ వేయించడంతో పాటు, దానికి సక్రమంగా విద్యుత్ సరఫరా అందేలా కరెంటు మీటరు బిగించారు.

ప్రజాప్రతినిధులకు కాలనీవాసుల కృతజ్ఞతలు

ఈ నూతన తాగునీటి వనరును నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి వెంకటరమణ, స్థానిక నాయకులు కుమార్, రమేష్, అరుణ్, శ్రీనివాస్, గండి గణేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. ఏళ్ల నాటి తమ తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేసిన మేయర్‌కు, స్థానిక ప్రజాప్రతినిధులకు కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>