తెలంగాణ భవన్‌లో నేడు బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ

కలం, వెబ్ డెస్క్ : శాసనసభ సమావేశాల నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ మాక్ అసెంబ్లీ (BRS Mock Assembly) నిర్వహణకు పిలుపునిచ్చింది. హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మాక్ అసెంబ్లీలో స్పీకర్‌గా మాణిక్యరావు వ్యవహరిస్తుండగా, ముఖ్యమంత్రి పాత్రను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పోషిస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరసన తెలపనున్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా సాగుతోందని విమర్శిస్తూ మాక్ అసెంబ్లీ వేదికగా తమ నిరసనను వినిపించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

Also Read : నేటి నుంచి బ్రిక్స్ సదస్సు ప్రారంభం

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>