సీఎస్‌కే కోసం ధోనీ కొత్త వ్యూహం!

కలం, స్పోర్ట్స్: వరుసగా మూడేళ్లు ప్లేఆఫ్స్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూట్ మార్చింది. సుదీర్ఘకాలంగా కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో భారత మాజీ ఆటగాడు హేమాంగ్ బదానీని కొత్త హెడ్ కోచ్‌గా నియమించేందుకు సిద్ధమైంది. ఈ కీలక మార్పు వెనుక మహేంద్రసింగ్ ధోనీ మాస్టర్ ప్లాన్ ఉంది. ఇన్నాళ్లూ విదేశీ కోచ్‌లతో పనిచేసిన సీఎస్‌కే, ఈసారి స్వదేశీ దిగ్గజానికే పగ్గాలు ఇవ్వాలని భావిస్తోంది. స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వేగంగా గుర్తించాలంటే భారతీయ కోచ్ అయితేనే బాగుంటుందని ధోనీ స్పష్టం చేశారు. ధోనీ సూచనతోనే యాజమాన్యం బదానీ వైపు మొగ్గు చూపింది.

కోచ్‌గా వచ్చేవారు వేరే లీగ్‌లలో కాకుండా కేవలం సీఎస్‌కేకే పరిమితం కావాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. టీఎన్‌పీఎల్‌లో చెపాక్ సూపర్ గిల్లీస్‌కు నాలుగు టైటిళ్లు అందించిన బదానీకి చెన్నై మైదానంపై పూర్తి పట్టు ఉంది. ఆయనకు ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ అనుభవం కూడా ఉంది. కొత్త కోచ్ ఎంపికలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ధోనీల నిర్ణయాలే కీలకం కానున్నాయి. అయితే ఎంపికకు ఇంకా తగినంత సమయం ఉందని గైక్వాడ్ పేర్కొన్నారు. మరో వారం లేదా రెండు వారాల్లో కొత్త హెడ్ కోచ్‌పై సీఎస్‌కే అధికారిక ప్రకటన చేయనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>