నిర్మల్ కలెక్టరేట్‌లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌ (Nirmal Collectorate) లోని సమావేశ మందిరంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి (Chakali Ilamma Death Anniversary) కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐలమ్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు (Venkateswarlu) అధికారులతో కలిసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను వివరించారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం చేసిందని, తెలంగాణ పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని లిఖించిందని తెలిపారు.

వెట్టి చాకిరి నిర్మూలనకు పోరాటం

వెట్టి చాకిరి నిర్మూలనకు పాటుపడిన గొప్ప మహిళ అని, చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చాకలి ఐలమ్మ లాంటి వీర వనితల చరిత్రను నేటి తరం ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శంకర్, సీపీఓ గంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>