కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘1980s AI ట్రెండ్’ (80s AI Trend) సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సాయంతో 80s నాటి హెయిర్‌స్టైల్, అప్పటి వింటేజ్ డ్రెస్సింగ్, పాతకాలపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా తమ ఫొటోలను రీక్రియేట్ చేసుకుంటూ నెటిజన్లు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఈ ట్రెండ్‌కు బాగా ఆకర్షితులై, తమ వింటేజ్ ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్), ఇన్ స్టాగ్రామ్ వంటి వేదికల్లో పోస్ట్ చేస్తూ ట్రెండ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.
యువతలో కనిపిస్తున్న ఈ క్రేజ్ చూసి ‘మేము మాత్రం ఎందుకు తగ్గాలి?’ అనుకున్నారో ఏమో, రాజకీయ దిగ్గజాలు సైతం ఈ వింటేజ్ ట్రెండ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ దైనందిన బిజీ షెడ్యూల్స్, రాజకీయ వేడిని పక్కన పెట్టి, సోషల్ మీడియాలో యూత్‌తో కనెక్ట్ అయ్యేందుకు ప్రముఖ నేతలు తమ 80s రెట్రో ఫొటోలను పంచుకోవడం ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా ఈ వైరల్ ట్రెండ్‌లో భాగమయ్యారు. అప్పటి కాలపు మాస్ హీరోలా కనిపించే ఏఐ జనరేటెడ్ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘Joining 80’s trend..’ అని క్యాప్షన్ ఇచ్చారు. పాతకాలపు యమహా RX 100 బైక్, పక్కనే వింటేజ్ రేడియో, ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌తో డాషింగ్ లుక్‌లో ఉన్న ఆయన ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. సీఎం మాస్ లుక్ చూసిన నెటిజన్లు ‘టాలీవుడ్ ఒక మంచి హీరోని మిస్ అయింది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. 80ల నాటి వింటేజ్ లుక్‌లో ఉన్న తన ఏఐ ఫోటోను పంచుకుంటూ ‘Vibes @ 80s trend’ అని క్యాప్షన్ జోడించారు. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయ సమావేశాలతో బిజీగా ఉండే నేతలు ఇలా సరదాగా ట్రెండ్(80s AI Trend)ను ఫాలో అవ్వడం సోషల్ మీడియాలో సరికొత్త వైబ్‌ను తీసుకువచ్చింది. అభిమానులు, నెటిజన్లు తమ నాయకుల నయా లుక్స్‌కు ఫిదా అవుతూ లైకులు, షేర్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు.
Also Read : ఇందిరమ్మ ఇండ్ల నిధులపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

