జాంపల్లి వద్ద అదుపు తప్పిన ప్రైవేటు స్కూల్ బస్సు

కలం,‌ జోగులాంబ గద్వాల:  జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా ధరూర్ మండలం జాంపల్లి గ్రామ (Jam Palle Village) శివారులో గద్వాలకు(Gadwal) చెందిన ఒక ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 60 మందికి పైగా స్కూల్ విద్యార్థులు ఉన్నారు.

మంగళవారం ఉదయం కేటిదొడ్డి మండలం నుంచి గద్వాల మండల సంగాలలో గల ఒక‌ ప్రైవేటు స్కూల్ కు విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో జాంపల్లి గ్రామ శివారులో‌ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు స్టీరింగ్ విరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిట్‌నెస్ లేని బస్సును‌ నడుపుతున్నారని, గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ యజామాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

బస్సు ఫిట్‌నెస్‌పై తల్లిదండ్రుల ఆందోళన

చాల పాత బస్సు కావడంతో పాటు బస్సులో పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్కూల్‌ బస్సు జాంపల్లి (Jam Palle Village) వద్ద ఉన్న ర్యాలంపాడు కాలువ క్రాస్ చేయంగానే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కాలువ రాక ముందే ఈ ఘటన చోటు చేసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు.

రవాణా శాఖ అధికారులు లంచాలకు మరిగి ప్రైవేటు స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ లేకుండా అనుమతులు ఇవ్వడంతోనే ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఇష్టారాజ్యం అయిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Also Read : 823 రోజులు మాత్రమే, వదిలిపెట్టం.. కేటీఆర్‌ ఆగ్రహం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>