బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలు.. స్పీకర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎదుట జరిగిన ఘటనపై సీఎం రెవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ను పరామర్శించారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. మంగళవారం అసెంబ్లీకి రాగానే స్పీకర్ ఛాంబర్ కు వెళ్లిన సీఎం ఆయనను పరామర్శించి ఓదార్చారు. సోమవారం జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేశారు.

అలాగే, అసెంబ్లీలో స్పీకర్ కంటతడి పెట్టడంపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పీకర్ కు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకుంటామని ఆయన (CM Revanth Reddy) స్పష్టం చేశారు.

కాగా, స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ను కించపరిచేలా మాట్లాడడంపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని సీఎం స్పీకర్ ను కోరారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>