కలం, స్పోర్ట్స్: గ్లోబల్ చెస్ లీగ్ (Global Chess League 2026) తొలిరోజే అదిరిపోయే డ్రామా, సంచలన విజయాలతో ప్రారంభమైంది. బోర్డుపై మైండ్ గేమ్‌లతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్.. ఈసారి బోర్డు బయట నవ్వులు పూయించారు. మ్యాక్సిమ్ వాచియర్-లగ్రావ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం కార్ల్‌సన్ ఇచ్చిన షేక్‌హ్యాండ్ రెండుసార్లు మిస్ కావడంతో ఇద్దరూ బిగ్గరగా నవ్వుకున్నారు. కార్ల్‌సన్ తన వ్యక్తిగత గేమ్‌ను డ్రాగా ముగించగా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్పైన్ పైపర్స్ 10-8తో చెక్ ముంబా మాస్టర్స్‌పై విజయం సాధించింది.
అమెరికన్ గాంబిట్స్ దూకుడు
తొలిరోజే ఫైయర్స్ అమెరికన్ గాంబిట్స్ (American Gambits) అదరగొట్టింది. తొలుత పిబిజి అలస్కాన్ నైట్స్‌ను 10-4తో ఓడించిన ఆ జట్టు.. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ త్రివేణి కాంటినెంటల్ కింగ్స్‌పై ఏకంగా 14-5తో ఘన విజయం సాధించింది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్‌కు మాత్రం లీగ్ ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్ చేతిలో 9-10తో ఓడిన ఆ జట్టు.. అనంతరం అమెరికన్ గాంబిట్స్ చేతిలో 5-14 తేడాతో చిత్తుగా పరాజయం పాలైంది. టోర్నీ ఇంకా సుదీర్ఘంగా కొనసాగనున్న నేపథ్యంలో తొలి రోజు ఫలితాల తర్వాత ఏ జట్లు పుంజుకుంటాయి? ఏ జట్లు ఆధిపత్యం కొనసాగిస్తాయి? అనేది ఆసక్తికరంగా మారింది.
తొలిరోజు మ్యాచ్ ఫలితాలు
ఫైయర్స్ అమెరికన్ గాంబిట్స్ vs పిబిజి అలస్కాన్ నైట్స్ (10 – 4 విజయం)
- జవోఖిర్ సిందరోవ్ విజయం – విశ్వనాథన్ ఆనంద్‌పై
- నిహాల్ సరిన్ డ్రా – అర్జున్ ఎరిగాసితో
- డానియెల్ దుబోవ్ డ్రా – యాగిజ్ కాన్ ఎర్డోగ్ముస్‌తో
- బిబిసారా అసౌబాయేవా డ్రా – కతెరినా లాగ్నోతో
- సరసదాత్ ఖాదెమాల్షరీహ్ డ్రా – నినో బాట్సియాష్విలితో
- మార్క్ ఆండ్రియా మౌరిజ్జీ విజయం – అభిమన్యు మిశ్రాపై
గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్ vs త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ (10 – 9 విజయం)
- ఇయాన్ నెపోమ్నియాట్చి డ్రా – అలీరెజా ఫిరౌజ్డాతో
- లెవాన్ అరోనియన్ విజయం – వెయ్ యీపై
- లీనియర్ డొమింగెజ్ పెరెజ్ ఓటమి – అరవింద్ చిదంబరం చేతిలో
- పొలినా షువాలోవా విజయం – జూ జిన్నెర్‌పై
- స్టావ్రూలా త్సోలాకిడౌ విజయం – అలెగ్జాండ్రా కొస్టెనియుక్‌పై
- లియోన్ మెండోన్కా ఓటమి – వి. ప్రణవ్ చేతిలో
ఆల్పైన్ పైపర్స్ vs చెక్ ముంబా మాస్టర్స్ (10 – 8 విజయం)
- మాగ్నస్ కార్ల్‌సన్ డ్రా – మ్యాక్సిమ్ వాచియర్-లగ్రావ్‌తో
- అనిష్ గిరి ఓటమి – ఎమ్. ప్రాణేష్ చేతిలో
- షాఖ్రియార్ మమేద్యారోవ్ ఓటమి – విదిత్ గుజరాతి చేతిలో
- డి. హారిక విజయం – దివ్య దేశ్‌ముఖ్‌పై
- కరిస్సా యిప్ ఓటమి – కోనేరు హంపి చేతిలో
- బార్దియా దానేశ్వర్ డ్రా – వోలోదార్ ముర్జిన్‌తో
ఫైయర్స్ అమెరికన్ గాంబిట్స్ vs త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ (14 – 5 విజయం)
- జవోఖిర్ సిందరోవ్ డ్రా – అలీరెజా ఫిరౌజ్డాతో
- నిహాల్ సరిన్ విజయం – వెయ్ యీపై
- డానియెల్ దుబోవ్ విజయం – అరవింద్ చిదంబరంపై
- బిబిసారా అసౌబాయేవా డ్రా – జూ జిన్నెర్‌తో
- సరసదాత్ ఖాదెమాల్షరీహ్ ఓటమి – అలెగ్జాండ్రా కొస్టెనియుక్ చేతిలో
- మార్క్ ఆండ్రియా మౌరిజ్జీ విజయం – వి. ప్రణవ్‌పై

