కలం, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న ‘NBK 111’ మూవీ టీమ్ మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించిన మాస్ ఎలివేషన్‌ను సూచిస్తూ సోషల్ మీడియాలో ఓ పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది.“ఇన్‌బిల్ట్ స్వాగ్.. అన్ఫిల్టర్డ్ యాటిట్యూడ్.. అన్‌టచబుల్ ఆరా” అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టు చేసింది.
నేడు సాయంత్రం 6:40 గంటలకు ‘NBK 111’ మూవీ టైటిల్, రిలీజ్ డేట్‌కు సంబంధించి ప్రత్యేక అప్డేట్ రాబోతుందని మూవీ టీం ప్రకటించింది. “Wait for the smo-KING to arrive” అంటూ చేసిన ఈ పోస్టు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరోసారి బాలయ్య సినిమా కోసం మాస్ బీట్స్ సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

